మానవుడవై సకల
Maanavudavai Sakala
UncategorizedAdded on 1/5/2018
Lyrics
మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు – బహు ప్రేమ తోడ ||మానవుడవై|| నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు – నియమంబు నిచ్చి ||మానవుడవై|| నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – నా యన్న యేసు ||మానవుడవై|| మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి – నీ ప్రేమ నుండి ||మానవుడవై|| నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ – నిజ భక్తి తోడ ||మానవుడవై|| ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప – శ్రీ యేసు దేవా ||మానవుడవై|| నిత్య బలియగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ – నిజ రూప మొంద ||మానవుడవై|| నేను నీ బలిలోన గలిసి నేను నీతో గలిసి మెలిసి నేను నీవలె నుండి జేసితివే – నా దివ్య యేసు ||మానవుడవై|| నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాప భారములు దిగునే – నా దివ్య యేసు ||మానవుడవై|| నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే – నిజ దేవా యేసు ||మానవుడవై|| నీవే నీ చేతులలో నిత్తువు ఈ నీ బలి విందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసు – ఎన్నడును మరువను ||మానవుడవై||