మారదయా నీ ప్రేమ
Maaradayaa Nee Praema
UncategorizedAdded on 6/18/2019
Lyrics
మారదయా నీ ప్రేమ మార్పు రాదయా నీ ప్రేమలో ఎన్ని మారినా మారని ప్రేమ యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా|| నిరీక్షించుచుంటిని నీ రాకకై వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| (నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| నీ మాటలయందే ఆశ యేసయ్యా వాగ్ధానములు నాలో నెరవేర్చుమా అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||