మారని దేవుడవు నీవేనయ్యా
Maarani Daevudavu Neevaenayyaa
UncategorizedAdded on 9/28/2016
Lyrics
మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని|| చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని|| నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా