మారిపోయెనే
Maaripoyenae
UncategorizedAdded on 4/18/2025
Lyrics
మేరి సౌమ్య అందనం మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే|| సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే||