మాటే చాలయ్యా
Maatae Chaalayyaa
UncategorizedAdded on 12/31/2016
Lyrics
నీ మాటలోనే జీవం ఉన్నది నీ మాట వల్లె జరుగును అద్భుతాలు నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు నీ మాటకు సమస్తం సాధ్యమే సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె|| పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును నీ మాటలో స్వస్థత ఉందయ్యా నీ మాటతోనే విడుదల కలుగును (2) ||నీ మాట వల్లె|| జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది నీ మాటలో జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారాము (2) ||నీ మాట వల్లె||