మాట్లాడే యేసయ్యా

Maatlaadae Yaesayyaa

Lyricistమాట్లాడే యేసయ్యా
UncategorizedAdded on 8/21/2018

Lyrics

నాతో మాట్లాడుచున్నాడు
(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు
(4)        ||మాట్లాడే||
వెన్నలాంటి కన్నులలో
కురిసే తన ప్రేమను పంచాలని
వేకువనే తట్టుచున్నాడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు
(2)           ||మాట్లాడే||
అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు
(2)           ||మాట్లాడే||
లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరిపించాడు మహనీయుడు
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జీవముగల సంఘములో నిలిపియున్నాడు
తన మాటతో నన్ను బలపరచాడు
కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు
(2)           ||మాట్లాడే||

Video