మాయాలోక ఛాయల్లోన
Maayaaloka Chhaayallona
UncategorizedAdded on 1/4/2022
Lyrics
జి యస్ మైఖేల్ మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది నమ్మబోకు నమ్మబోకు సోదరా ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు ఎంత ఘోర పాపివైన చింత లేదురా సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా స్వర్గము విడి యేసయ్యా చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా – (2) ||ప్రేమ గల|| చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో శత్రువును సైతము ప్రేమించమన్నాడు – నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే – అన్నయ్యా యేసులోకి రావాలయ్యా అక్కయ్యా యేసులోకి రావాలమ్మా