మధురమైనది

Madhuramainadi

UncategorizedAdded on 2/20/2016

Lyrics

మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా
(2)        ||మధురమైనది||
ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం
||ప్రేమా||
పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
ఎగసి పడే అలలతో కడలే గర్జించినా
మరణపు ఛాయలే దరి చేరనీయక
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం
||ప్రేమా||
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి
మరణపు ముల్లును విరచిన దేవా
జీవము నొసగిన నీ ప్రేమ మధురం
||ప్రేమా||

Video