మధురం మధురం
Madhurm Madhurm
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 8/5/2017
Lyrics
మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం దీన మనస్సు – దయ గల మాటలు సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు ప్రయాసపడు వారి భారము తొలగించుటకు ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా జడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||