మధురం మధురం నీ ప్రేమే
Madhurm Madhurm Nee Praemae
UncategorizedAdded on 8/21/2017
Lyrics
అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం|| నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం|| సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ మహోన్నతుడా మహా ఘనుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||