మేఘాల పైన మన యేసు
Maeghaala Paina Mana Yaesu
Lyricistఫిలిప్ & షారోన్
UncategorizedAdded on 1/29/2017
Lyrics
మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల|| ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు బూర శబ్దం మ్రోగగా ప్రభుని రాకడ వచ్చును రెప్ప పాటున పరిశుద్ధులు కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల|| పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే వినుట వలన విశ్వాసం కలుగును సోదరా దేవుని ఆజ్ఞకు లోబడితే పొందెదవు పరలోకం ||మేఘాల|| స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లు గాక తర తరములకు యుగయుగములు యేసే మారని దైవం నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||