మేలైనా కీడైనా

Maelainaa Keedainaa

Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 1/8/2018

Lyrics

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను
నిత్యము నీ కీర్తి నా నోట నుండును
(2)      ||మేలైనా||
కలిమి చేజారి నను ముంచినా
స్థితిని తలక్రిందులే చేసినా
రెండింతలుగా దయచేసెదవని
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా
(2)      ||మేలైనా||
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము పొంది నే కృంగినా
నా మొర విని కృప చూపెదవని
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా
(2)      ||మేలైనా||
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా
ఆపదలలో విడిపించెదవని
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా
(2)      ||మేలైనా||

Video