మేలు చేయక
Maelu Chaeyaka
Lyricistజోబ్ దాస్
UncategorizedAdded on 6/30/2023
Lyrics
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||