మేలుకో మహిమ రాజు

Maeluko Mahima Raaju

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/30/2023

Lyrics

మేలుకో! మహిమ రాజు
వేగమే రానై యున్నాడు
పరమునుండి – బూర ధ్వనితో
అరయు నేసు – ఆర్భాటముతో
సర్వలోకము – తేరిచూచును
త్వరపడు ఓ ప్రియుండా
(2)       ||మేలుకో||
గురుతులెల్ల – ధరణియందు
సరిగ చూడ – జరుగుచుండ
చిరునవ్వుతో – చేరి ప్రభుని
త్వరపడు ఓ ప్రియుండా
(2)       ||మేలుకో||
క్రీస్తునందు – మృతులెల్లరు
కడబూర – మ్రోగగానే
క్రీస్తువలె – తిరిగి లేతురు
లేతువా? నీవు ప్రియుడా
(2)       ||మేలుకో||
అరయంగ – పరిశుద్ధులు
మురిసెదరు – అక్షయ దేహులై
పరమందు – ప్రభుక్రీస్తు
నిరతము – ఓ ప్రియుండా
(2)       ||మేలుకో||
కరుణలేని – ఓ మరణమా
నిరతము నీకు జయమగునా
మరణ సంహా – రుండేసు
త్వరగా – రానై యున్నాడు
(2)       ||మేలుకో||
మాంసలోక – పిశాచాదులు
హింస పరచ – విజృంభించిన
లేశమైనను – జడియకుము
ఆశతో – కాచుకొనుము
(2)       ||మేలుకో||
పాపమును – చేయకుమా
రేపకుమా – దైవ కోపమును
శాపమును – తప్పుకొని
శ్రద్ధతో – కాచుకొనుమా
(2)       ||మేలుకో||

Video