మేలుకో విశ్వాసి మేలుకో

Maeluko Vishvaasi Maeluko

Lyricistవిద్యార్థి గీతావళి
UncategorizedAdded on 1/13/2016

Lyrics

మేలుకో విశ్వాసి మేలుకో
చూచుకో నీ స్థితిని కాచుకో
మేలుకో విశ్వాసి మేలుకో
ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం
ఇహ లోక మాలిన్యం దూరపరచుకో
మదిలోని మురికినంత కడిగివేసికో
||మేలుకో||
నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త
మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త
విశ్వాసం లేని దుష్ట హృదయము
చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త
||మేలుకో||
ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా
ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా
ప్రేమ లేక ద్వేషింప బూనితే
క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా
||మేలుకో||

Video