మేము భయపడము

Maemu Bhayapadamu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 4/23/2020

Lyrics

మేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు
దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే
దీవారాత్రులు దేవుడే కాయును
||మేము||
శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును
||మేము||
అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ
ఏ ఘడియైనను విడువక కాయును
||మేము||
బలమైన ప్రభు హస్తములు
వలయము వలె మమ్ము జుట్టి
పలు విధములుగా కాపాడు మమ్ము
||మేము||
కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు
కను పాపగా మము కాపాడునెప్పుడు
||మేము||
జీవిత కష్ట నష్టములు
ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవుల నెంచుచు
||మేము||
ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడు ప్రభున్
మహిమపరచి మ్రొక్కెదములలో
||మేము||

Video