మహాఘనుడవు మహోన్నతుడవు

Mahaaghanudavu Mahonnathudavu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 12/31/2016

Lyrics

మహాఘనుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా
వినయముగల వారిని
తగిన సమయములో హెచ్చించువాడవని
నీవు వాడు పాత్రనై నేనుండుటకై
నిలిచియుందును పవిత్రతతో
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా
దీన మనస్సు గలవారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని
నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెళకువతో
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా
శోధింపబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
విశ్రమింతును అంతము వరకు
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా

Video