మహిమ నీకే ప్రభూ
Mahima Neekae Prabhoo
Lyricistఅంశుమతి దార్ల
UncategorizedAdded on 9/29/2016
Lyrics
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ ఆరాధనా… ఆరాధనా… ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ|| సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||