మహిమాన్వితము

Mahimaanvithamu

Lyricistఆడమ్ బెన్నీ
UncategorizedAdded on 1/4/2021

Lyrics

మహిమాన్వితము మనోహరము
నీ దివ్య సన్నిధానము
నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య
నీవే కావాలని యేసయ్య
(2)     ||మహిమాన్వితము||
కోరలేదు ధన సంపద
కోరినాను నిను మాత్రమే
ఐశ్వర్యము కంటే అధికుడవు
నీ ఆశ్రయమే చాలునయా
(2)       ||నిన్నే||
జీవపు ఊటలు కల చోటికి
జీవ నదులు పారే చోటికి
ప్రేమతో పిలచిన నా యేసయ్యా
నా దాహమును తీర్చెదవు
(2)        ||నిన్నే||
తేజోనివాసుల నివాసము
చేరాలనునదే నా ఆశయ్యా
యుగయుగములు నే నీతో ఉండి
నిత్యారాధన చేయాలని
(2)        ||నిన్నే||

Video