మహోన్నతుడా మా దేవా

Mahonnathudaa Maa Daevaa

UncategorizedAdded on 10/8/2016

Lyrics

మహోన్నతుడా మా దేవా
సహాయకుడా యెహోవా
ఉదయ కాలపు నైవేద్యము
హృదయపూర్వక అర్పణము
మా స్తుతి నీకేనయ్యా
ఆరాధింతునయ్యా
(2)          ||మహోన్నతుడా||
అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు
అసమానమైన తేజో మహిమ
కలిగిన ఆ ప్రభువా
(2)          ||మా స్తుతి||
జలముల ధ్వని వంటి కంట స్వరం
నోటను రెండంచుల ఖడ్గం
ఏడు నక్షత్రముల ఏడాత్మలను
కలిగిన ఆ ప్రభువా
(2)          ||మా స్తుతి||
ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా
పాతాళ లోకపు తాళపు చెవులు
కలిగిన ఆ ప్రభువా
(2)          ||మా స్తుతి||

Video