మనసారా పూజించి
Manasaaraa Poojimchi
Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 9/24/2016
Lyrics
మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా|| నిన్న నేడు ఉన్నవాడవు నీవు ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా|| రక్షణ కొరకై లోకానికి వచ్చావు సాతాన్ని ఓడించిన విజయశీలుడవు మరణము గెలిచి తిరిగి లేచావు నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||