మనసెరిగిన యేసయ్యా
Manaserigina Yaesayyaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 9/23/2021
Lyrics
మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||