మనసులొకటాయే భువిలో

Manasulokataayae Bhuvilo

Lyricistమైఖెల్ కళ్యాణపు
UncategorizedAdded on 4/27/2018

Lyrics

మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో
మనసు పరవశమై మధుర లాహిరిలో
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా
||మనసులొకటాయే||
ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా
ఈ మధురమైన శుభవేళ
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం
||మనసులొకటాయే||
అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా
ఘన యేసుని దివ్య ఆశీస్సు
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం
||మనసులొకటాయే||

Video