మనిషి బ్రతుకు రంగుల వలయం
Manishi Brathuku Rmgula Valaym
Lyricistటోనీ ప్రకాష్
UncategorizedAdded on 10/13/2016
Lyrics
మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ బ్రతుకే క్షణ భంగురం మారాలి ప్రతి హృదయం వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| గడ్డి పువ్వురా మనిషి జీవితం గాలి వీచగా రాలిపోవును గాలిలో నిలువని దీపమురా ఇది గాలిలో ఎగిరే గాలిపటం రా తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ఆత్మ వెళ్లగా శవమని నిన్ను ఇంట నుంచరు పంచ చేర్చెదరు ఇరుగు పొరుగువారు కూడ కొందరు వల్లకాటి వరకే వచ్చెదరు తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ధనమున్నదని గర్వించకురా ధనమే నీకు తోడు రాదురా లోకమే నీకు అశాశ్వతంబురా పరలోకమే నీకు శాశ్వతంబురా తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||