మన్నేగదయ్యా

Mannaegadayyaa

Lyricistమన్నేగదయ్యా మన్నేగదయ్యా
UncategorizedAdded on 2/19/2017

Lyrics

మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా
(2)        ||మన్నేగదయ్యా||
మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
మించిన బంగారము మించిన నీ దేహము
ఉంచుము ఎన్నాళ్ళకుండునో
మరణించగానే మన్నేగదయ్యా
(2)        ||మన్నేగదయ్యా||
ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా
నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా
మెల్లని పుష్పంబు పోలినా
పుష్పంబుతోనే ఊడిపడినది
(2)        ||మన్నేగదయ్యా||
మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము
కుక్క శవంతో సమమేగా
నిక్కముగనదియు మన్నేగదయ్యా
(2)        ||మన్నేగదయ్యా||
మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల
మరణమును జయించుచున్న కాలమింత మన్నిల
మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును
(2)        ||మన్నేగదయ్యా||

Video

Mannaegadayyaa Lyrics | Shining Christians