మరణము నన్నేమి చేయలేదు

Maranamu Nannaemi Chaeyalaedu

Lyricistదీవెనయ్య
UncategorizedAdded on 9/2/2017

Lyrics

మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు
(2)        ||మరణము||
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
(2)        ||మరణము||
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
(2)        ||మరణము||
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
(2)        ||మరణము||
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
(2)        ||మరణము||

Video