మరువగలనా మరలా
Maruvagalanaa Maralaa
Lyricistజోనా శామ్యూల్
UncategorizedAdded on 10/14/2016
Lyrics
మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను ఆశయు అక్కరయు పాపమై చిక్కితి శత్రువు చేతులలో మరణపు టంచున చేరితిని ఇంతలోనే యేసు కరుణింప వచ్చి క్షమియించి విడిపించెను ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను ఏ పాపికి కడు భాగ్యమే యేసుని చేరగ ధన్యమే యేసుని ప్రేమ అనంతమే నీ పాపమంతా తొలగించి యేసు ప్రేమించి దీవించును నీ భారమంతయు భరియించును కన్నీరు తుడిచి ఓదార్చును శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్ మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా ఆ సిల్వ ప్రేమను చూపెదను నా క్రీస్తు వార్తను చాటెదను జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను