మరువలేనయ్యా
Maruvalaenayyaa
Lyricistడేవిడ్ రాజ్
UncategorizedAdded on 11/19/2017
Lyrics
సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా మరచిపోనయ్యా నీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| నా కోసమే నీవు జన్మించితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి నా కోసమే నీవు మరణించితివి నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| ఎవరూ చూపని ప్రేమను చూపి ఎవరూ చేయని త్యాగము చేసి విడువను ఎడబాయను అన్నావు నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||