మరువని నీదు ప్రేమతో

Maruvani Needu Praematho

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 7/6/2020

Lyrics

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా
(2)       ||మరువని||
కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె
పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము
(2)       ||మరువని||
నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది
తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము
నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు
(2)       ||మరువని||

Video