మట్టినైన నన్ను

Mattinaina Nannu

UncategorizedAdded on 5/23/2020

Lyrics

పి కిషోర్ కుమార్
మట్టినైన నన్ను మనిషిగా మార్చి
జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు
ఎంత పాడినా – ఎంత పొగిడినా
ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా
నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
నా యేసురాజా నా దైవమా
నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే
నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే
నీ ధర్మశాస్త్రము యధార్థమైనది
అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును
(2)    ||ఎంత పాడినా||
అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే
కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే
నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం
విశ్వ మానవాళికి పాపవిమోచన
(2)    ||ఎంత పాడినా||

Video