మెల్లని స్వరమే
Mellani Svaramae
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 10/26/2017
Lyrics
మెల్లని స్వరమే వినిపించావే చల్లని చూపుతో దీవించినావే వాక్యపు ఒడిలో లాలించినావే ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని|| తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిను నేను చేరితిని అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నిను నేను చేరితిని నాకంటే ముందుగా నీవొచ్చినావే నీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని|| కృంగిన కాలములో వేదనల వేళలో సోమసిన సమయములో నిను నేను చేరితిని నా గాథ అంతయు గమనించినావే నా గుండె మంటలను ఆర్పేసినావే (2) ||మెల్లని||