మంచే లేని నా పైన

Mmchae Laeni Naa Paina

Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 1/31/2017

Lyrics

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా
(2)         ||మంచే లేని||
లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు
నీదెంత దీన మనస్సు
నా కెంత ఘనత యేసు
||ఎంతగా||
నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు
నీలోన జాలి పొంగె
నాలోన శాంతి నిండె
||ఎంతగా||
చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు
నీ సాటిలేని త్యాగం
నా పాలి గొప్ప భాగ్యం
||ఎంతగా||

Video