మంచి స్నేహితుడా

Mmchi Snaehithudaa

Lyricistప్రవీణ్ కుమార్
UncategorizedAdded on 11/8/2016

Lyrics

మంచి స్నేహితుడా మంచి కాపరివి
అగాధ జలములలో నేను నడచినను
అరణ్య యానములో నేను తిరిగినను
నన్ను ఆదరించినావు ఓదార్చినావు
చేర దీసినావు కాపాడినావు
నీకే ఆరాధన – నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు
ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు
ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు
ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు
||ఆరాధన||
చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు
బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు
నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు
నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు
||ఆరాధన||
ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి
ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి
నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు

Video