మంచి స్నేహితుడు
Mmchi Snaehithudu
Lyricistసురేష్ వంగూరి
UncategorizedAdded on 3/8/2024
Lyrics
మంచి స్నేహితుడు హితమును కోరే బ్రతుకును మార్చే ప్రాణస్నేహితుడేసు (2) ||మంచి స్నేహితుడు|| ఒరిగిన వేళ పరుగున చేరి గుండెలకదిమే తల్లవుతాడు అక్కరలోన పక్కన నిలిచి చల్లగ నిమిరే తండ్రవుతాడు ఒంటరితనమున చెలిమవుతాడు కృంగిన క్షణమున బలమవుతాడు – (2) ||మంచి స్నేహితుడు|| చీకటి దారుల తడబడు ఘడియల వెచ్చగ సోకే వెలుగవుతాడు పతనపు లోయల జారిన వేళల చెయ్యందించే గెలుపవుతాడు శోధనలోన ఓర్పవుతాడు శోకంలో ఓదార్పవుతాడు – (2) ||మంచి స్నేహితుడు||