మంచిని పంచే దారొకటి
Mmchini Pmchae Daarokati
UncategorizedAdded on 7/7/2018
Lyrics
మంచిని పంచే దారొకటి వంచన పెంచే దారొకటి రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి సరి చూసుకో ఒక్కసారి మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు పాపికి రక్షణ తెస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని|| మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు దేవుని ఎదిరిస్తుంటాడు నరకాగ్నిలో పడదోస్తాడు అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||