మంగళమే యేసునకు
Mmgalamae Yaesunaku
Lyricistపురుషోత్తము చౌదరి
UncategorizedAdded on 8/10/2019
Lyrics
మంగళమే యేసునకు – మానుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే|| పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే|| దురిత సంహారునకు – వర సుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే|| సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు నిత్య స్వయంజీవునకు నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే|| యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి సత్య పరంజ్యోతి యగు సార్వభౌమునకు మంగళమే ||మంగళమే|| నర ఘోర కలుషముల – నురుమారంగ నిల కరుదెంచిన మా పాలి వర రక్షకునకు మంగళమే ||మంగళమే|| పరమపురి వాసునకు – నర దైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||