మోకాళ్ళ అనుభవము
Mokaalla Anubhavamu
UncategorizedAdded on 2/25/2022
Lyrics
విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా వెలిగే దీపానికి నూనె అవసరం నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం నూనె లేని దీపము ఆరిపోవును ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ|| శోధనలో పడకుండా ప్రార్ధించుము శోధన తప్పించుటకు ప్రార్ధించుము కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ|| ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా పరలోక సంతోషం దేవుడిచ్చును పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ|| అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు అడిగి చూడుము సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||