మోయలేని భారమంత

Moyalaeni Bhaarammtha

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 3/14/2020

Lyrics

మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు –
కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము
(2)        || మోయలేని ||
జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము
(2)        || మోయలేని ||
దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ
(2)        || మోయలేని ||

Video