నా ఆశల పల్లకి

Naa Aashala Pallaki

UncategorizedAdded on 9/10/2019

Lyrics

జే పి రమేష్
నా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా
ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది
నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని
దాహము తీర్చావని
||యేసయ్యా||
దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా
నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే
నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే
తోడుగ ఉన్నావని
తోడుగ ఉన్నావని
||యేసయ్యా||
స్నేహితులు లేరని – తోడెవరు రారని
నా మనసు నాలోన – దుఃఖించు సమయాన
నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు
ఆదరించావయ్యా
ఆదరించావయ్యా
||యేసయ్యా||

Video