నా దీపము యేసయ్యా
Naa Deepamu Yaesayyaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 6/26/2018
Lyrics
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||