నా గీతారాధనలో
Naa Geethaaraadhanalo
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 12/30/2017
Lyrics
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా|| నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా|| చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా|| ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||