నా గుండె చప్పుడు చేస్తుంది

Naa Gumde Chappudu Chaesthumdi

UncategorizedAdded on 10/7/2015

Lyrics

నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని
పదే పదే పాడుతుంది నా నాలుకా
నీకే నా ఆరాధనా యేసయ్యా
నీకే నా ఆరాధనా
నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా
నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా
నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు
కేవలం నీ కృపయే
కేవలం నీ కృపయే
||నా గుండె||
నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు
నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు
నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట
నాకెంత భాగ్యము
నాకెంత భాగ్యము
||నా గుండె||

Video