నా హృదయములో

Naa Hrudayamulo

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 11/14/2016

Lyrics

నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా
(2)        ||నా హృదయములో||
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు
||నీ కార్యములను||
విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు
||నీ కార్యములను||
పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు
||నీ కార్యములను||

Video