నా జీవిత భాగస్వామి

Naa Jeevitha Bhaagasvaami

Lyricistజోయెల్ ఎన్ బాబ్
UncategorizedAdded on 9/13/2020

Lyrics

నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామి
నా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామి
యేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడా
యేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా
అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావు
జీవాత్మగ నను చేసి సృష్టించావు
ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా
నా సమస్తముతో ఆరాధింతును
(2)     ||యేసయ్యా||
అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించి
నీ వధువుగా నన్ను స్వీకరించావు (2)
నీ ఋణమెలా తీర్చగలనేసయ్యా
నా జీవితముతో ఆరాధింతును
(2)     ||యేసయ్యా||

Video