నా జీవిత భాగస్వామివి
Naa Jeevitha Bhaagasvaamivi
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 8/11/2021
Lyrics
నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి నీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత|| నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు నీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||