నా జీవిత యాత్రలో

Naa Jeevitha Yaathralo

UncategorizedAdded on 2/14/2018

Lyrics

నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
(2)       ||నా జీవిత||
పలు విధ శోధన కష్టములు
ఆవరించియుండగా
కలత చెందుచున్న హృదయమును
కదలక కాపాడుము
(2)       ||నా జీవిత||
నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు
నీదు కుడి హస్తములో నిత్యమున
నాకు సుఖ క్షేమముగా
(2)       ||నా జీవిత||
ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా
మారని వాగ్ధానములన్నియు
నే నమ్మి సాగెదను
(2)       ||నా జీవిత||
ముందున్న సంతోషము తలంచి
నిందలను సహించి
నీ సిలువను నే మోయుటకై
నీ కృప నాకీయుము
(2)     ||నా జీవిత||
సీయోను యొక్క ఆలోచనతో
సదా నడిపించుము
మహిమలో నీతోనే నిల్చుటకు
నా తండ్రి దయచూపుము
(2)     ||నా జీవిత||

Video