నా జీవితాంతము

Naa Jeevithaamthamu

UncategorizedAdded on 1/4/2018

Lyrics

ఏ డి శిఖామణి
నా జీవితాంతము
నీ సేవ చేతునంటిని
నే బ్రతుకు కాలము
నీతోనే నడుతునంటిని
నా మనవి వింటివి
నన్నాదుకొంటివి
(2)        ||నా జీవితాంతము||
నీ ప్రేమ చూపించి
నన్ను నీవు పిలిచితివి
నీ శక్తి పంపించి
బలపరచి నిలిపితివి
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా
(2)       ||నా జీవితాంతము||
రోగముతో పలుమార్లు
పడియుండ లేపితివి
ఘోరమై పోకుండా
స్థిరపరచి కాచితివి
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా
(2)       ||నా జీవితాంతము||
దూషించు దుష్టులకు
సిగ్గును కలిగించితివి
వేలాది ఆత్మలకు
మేలుగ నన్నుంచితివి
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా
(2)       ||నా జీవితాంతము||
సంఘములు కట్టుటకు
సామర్ధ్యమిచ్చితివి
ఉపదేశమిచ్చుటకు
దేశములు తిప్పితివి
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా
(2)       ||నా జీవితాంతము||

Video