నా జీవం నా సర్వం
Naa Jeevm Naa Sarvm
Lyricistకృపల్ మోహన్
UncategorizedAdded on 11/5/2013
Lyrics
నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును ||నా జీవం|| మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) ||నా జీవం|| నీవే నీవే నీవే దేవా