నా జీవం నీ కృపలో

Naa Jeevm Nee Krupalo

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 6/12/2018

Lyrics

నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం
||నా జీవం||
పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే
(2)       ||నా జీవం||
ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే
(2)       ||నా జీవం||
కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే
(2)       ||నా జీవం||
వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే
(2)       ||నా జీవం||
స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే
(2)       ||నా జీవం||

Video