నా కనుచూపు మేర

Naa Kanuchoopu Maera

Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 4/29/2020

Lyrics

నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ
పొంగి పారెనే – పొంగి పారెనే
నే ప్రేమింతును – నా యేసుని మనసారా
ఆరిపోవు లోక ప్రేమల కన్నా
ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న
(2)      ||నా కనుచూపు||
నా కన్నీటిని తుడిచినా ప్రేమ
నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
(2)      ||నా కనుచూపు||
నా దీన స్థితిని చూచిన ప్రేమ
తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
(2)      ||నా కనుచూపు||
నా భారంబును మోసిన ప్రేమ
సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
(2)      ||నా కనుచూపు||

Video